టీడీపీ నేతల హత్య కేసు: పోలీసులపై అంబటి ఆగ్రహం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-25 13:04:22  IST  )

టీడీపీ నేతల దారుణ హత్యకు వైసీపీకి ఏం సంబంధమని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు..

టీడీపీ నేతల హత్య కేసు: పోలీసులపై అంబటి ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా(Palnadu District)లో ఇద్దరు టీడీపీ నేతలు దారుణం హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Former YSRCP MLA from Macherla Pinnelli Ramakrishna Reddy)తో పాటు ఆయన సోదరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు(Ambati Rambabu) స్పందించారు. గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ టీడీపీ నేతల హత్యకు తమ పార్టీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. ఆధిపత్య పోరులోనే టీడీపీ(Tdp) వర్గీయులే చంపారని ఆయన తెలిపారు. చనిపోయినవారు, చంపిన వారు టీడీపీకి చెందిన వారేనని గుంటూరు జిల్లా ఎస్పీ చెప్పారు. కానీ పోలీసులు మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడిపై కేసు నమోదు చేయడం దారుణమన్నారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఈ కేసులు పెట్టారని ఆరోపించారు. ఇలా అక్రమ కేసులు పెట్టడం ధర్మమా అని అంబటి ప్రశ్నించారు.

Next Story