- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి నాదెండ్ల పీడీఎస్ రైస్ దొంగ: మాజీ మంత్రి అంబటి సంచలన ఆరోపణలు
మంత్రి నాదెండ్ల మనోహర్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు...

దిశ, వెబ్ డెస్క్: మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar)పై మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) సంచలన వ్యాఖ్యలు చేశారు. నాదెండ్ల మనోహర్ పీడీఎస్ రైస్(PDS Rice) దొంగ అని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో వేలాది టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతోందని, నాదెండ్ల వేల కోట్లు అవినీతి చేసి సంపాదిస్తున్నారని అంబటి వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ మోసపూరితమని మండిపడ్డారు. ఎన్నికల హామీలను అమలు చేయలేకపోతున్నారని విమర్శించారు. జగన్ రూ. 14 లక్షల కోట్లు అప్పులు చేసినట్లు చంద్రబాబు విష ప్రచారం చేశారని మండిపడ్డారు. అప్పుల విషయంలోకి వచ్చే సరికి చంద్రబాబు, లోకేశ్ చాలా తిప్పలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. కాగ్ లెక్కల ప్రకారం బడ్జెల్‌లోనే రూ.6 లక్షల 46 వేల కోట్లు మాత్రమేనని చెప్పారని తెలిపారు. జగన్‌పై బురద చల్లి ఎన్నికల హామీలు ఎగ్గొట్టాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ ప్రతిపక్ష హోదా తీసుకోవాలని అంబటి డిమాండ్ చేశారు.






