- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉప్పాల హారికపై దాడి ఘటన: మాజీ మంత్రి అంబటి కీలక డిమాండ్
వైసీపీ మహిళా నాయకురాలు ఉప్పాల హారికపై దాడి ఘటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక డిమాండ్ చేశారు....

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ(Ycp) మహిళా నాయకురాలు ఉప్పాల హారిక(Uppala Harika)పై జరిగిన దాడి ఘటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) కీలక డిమాండ్ చేశారు. ఈ దాడిపై హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) సమాధానం చెప్పాలన్నారు. గుంటూరు క్యాంపు కార్యాలయం(Guntur Camp Office)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అరాచక శక్తులను అదుపు చేసే బాధ్యత పోలీసులకు లేదా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ ప్రోత్సాహంతోనే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, ఒక బీసీ మహిళా ప్రజా ప్రతినిధిపై దాడి చేయడానికి సిగ్గుపడాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులపై దాడులు జరుగుతుంటే పోలీసులు కనీసం కేసులు సైతం నమోదు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతగా రాష్ట్ర డీజీపీ మారిపోయారని అంబటి ఎద్దేవా చేశారు.
కాగా కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నాగవరప్పాడులో వైసీపీ చైర్ పర్సన్ హారిక కారుపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిపై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు కురిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు సైతం స్పందించారు. టీడీపీ నేతలు, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు నిష్పక్షపాతంగా పని చేయాలని అంబటి సూచించారు.






