- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబటిపై మరో పీటీ వారెంట్.. కోర్టులో హాజరుపర్చాలని జడ్జి ఆదేశం
మాజీ మంత్రి అంబటి రాంబాబును వరుస కేసులు వెంటాడుతున్నాయి..

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu)పై పోలీసులు కోర్టులో మరో పీటీ వారెంట్(PT Warrant) దాఖలు చేశారు. 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా నిర్వహించారని, ఆ సందర్భంలో కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని పోలీసులకు జనసేన(Janasena) గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు(Gade Venkateswara Rao) ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఆయనపై తాజాగా కోర్టులో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన జడ్జి అంబటి రాంబాబును ధర్మాసనం ఎదుట హాజరుపర్చాలని ఆదేశాలు జారీ చేశారు.
వెంటాడుతున్న కేసులు
కాగా మాజీ మంత్రి అంబటి రాంబాబును వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రెండు కేసుల్లో అరెస్ట్ అయిన ఆయనకు బెయిల్ మంజూరు అయింది. సీఎం దూషించిన కేసులో బెయిల్ పై విడుదల అయ్యారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో బెయిల్ మంజూరు అయింది. ఈ మేరకు ఆయన జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. ఈ సమయంలో మరో కేసు వెలుగులోకి వచ్చింది. తమ ఎదుట హాజరుపర్చాలని కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అంబటి విడుదల కాకుండానే మళ్లీ జైలుకు వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ శ్రేణులు, అంబటి అనుచరుల్లో టెన్షన్ నెలకొంది.






