అంబటికి మరో షాక్.. క్వాష్ పిటిషన్లపై మార్చి 1కి విచారణ వాయిదా

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-09 12:35:35  IST  )

మాజీ మంత్రి అంబటి రాంబాబు మరో షాక్ తగిలింది..

అంబటికి మరో షాక్.. క్వాష్ పిటిషన్లపై మార్చి 1కి  విచారణ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) మరో షాక్ తగిలింది. గుంటూరు పట్టాభిపురం(Guntur Pattabhipuram), నగరంపాలెం(Nagarampalem)లో ఆయనపై నమోదు అయిన కేసులను క్వాష్ చేయాలని హైకోర్టు(High Court)లో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్లపై సోమవారం ధర్మాసనం విచారించింది. ఇరువర్గాల విన్న కోర్టు విచారణను మార్చి 1కి వాయిదా వేసింది. అయితే అంబటిని విచారణ చేయాలంటే జారీ విచారణ జరపాలని, ప్రొసీజర్ ఫాలో కావాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.

కాగా గుంటూరు పట్టాభిపురంలో నమోదైన కేసులో ఆయనకు ఈ రోజే కోర్టు రిమాండ్ విధించింది. మరోవైపు సీఎంను దూషించిన కేసులో అంబటి ఇప్పటికే రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉన్నారు. ప్రస్తుతం ఈ రెండు కేసుల్లోనూ ఆయన రిమాండ్ అనుభవిస్తున్నారు. ఇక ఈ రెండే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అంబటి రాంబాబుపై ఇంకా 34 కేసులు ఉన్నాయి. మరి ఈ కేసుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

Next Story