- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాజా టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత.. పోలీసులపై అంబటి దురుసు ప్రవర్తన
గుంటూరు ఎన్‌హెచ్-16 విజయవాడ నుంచి చిలకలూరిపేట మార్గం కాజా టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది....

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లోని గుంటూరు(Guntur)లో ఎన్‌హెచ్-16లోని విజయవాడ(Vijayawada) నుంచి చిలకలూరిపేట(Chilakaluripet) మార్గం కాజా టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంగళగిరి పోలీసుల(Mangalagiri)పై వైసీపీ నేత అంబటి రాంబాబు(Ycp Leader Ambati Rambabu) ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్తెనపల్లి(Sattenapalli)లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా కేసు(Sankranthi lucky draw case)లో ఆయనకు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు రాజమండ్రి జైలు నుంచి వస్తూ గుంటూరు సమీపంలోని కాజా టోల్ వద్ద అంబటి రాంబాబు హడావుడి చేశారు. పోలీసులపై ఆయన దురుసుగా ప్రవర్తించారు. వాహనాలు ఎలాపడితే అలా రావడంతో వరుస క్రమంలో రావాలని మంగళగిరి ఎస్సై వెంకట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీ అంతు చూస్తా’ అంటూ అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు. దీంతో పోలీసులు, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది






