- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఆర్ మరణంతోనే టీడీపీ చచ్చిపోయింది: మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు
ఎన్టీఆర్‌తోనే తెలుగుదేశం పార్టీ చచ్చిపోయిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు...

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్(NTR)తోనే తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) చచ్చిపోయిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) విమర్శించారు. టీడీపీ 43వ ఆవిర్భావం సందర్భంగా సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి లోకేశ్(Minister Lokesh) చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గుంటూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Guntur YSR Congress Party) కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. ప్రస్తుతమున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నేతృత్వంలోనిదని, వెన్ను పోటు నుంచి పుట్టిందని ఎద్దేవా చేశారు. నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Rama Rao) టీడీపీని స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడున్నరో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కుని అవకాశవాద రాజకీయాలను తెరతీశారని అంబటి ఆరోపించారు. చంద్రబాబు పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లారా అని ప్రశ్నించారు. అన్ని పార్టీల జెండాలు ఆయన పక్కన పెడితేగాని టీడీపీ జెండా ఎగరలేదని ఎద్దేవా చేశారు. సింగిల్‌గా ఎన్నికలకు వెళ్లలేని పార్టీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నడుస్తున్న పార్టీ టీడీపీ అని మాజీ మంత్రి లోకేశ్ విమర్శించారు.
మంత్రి నారా లోకేశ్ అధికార మదంతో మాట్లాడుతున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రెడ్ బుక్‌ను చూసి రాష్ట్రంలో అందరూ వణకిపోతున్నారని లోకేశ్ విర్రవీగుతున్నారని, స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లిన్పుడు వణికిపోతూ మాట్లాడిన మాటలు మర్చిపోయారని సెటైర్ వేశారు. లోకేశ్‌కు ముందుంది ముసళ్ల పండుగ అని హెచ్చరించారు. లోకేశ్ వల్ల వేధింపులకు గురవుతున్న ప్రతి ఒక్కరూ తమ బుక్కుల్లో ఆయన పేరు రాసుకుంటున్నారని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.






