ఆ సంస్థను వెంటనే రంగంలోకి దింపండి.. మిర్చి కొనుగోళ్లపై అంబటి సంచలన డిమాండ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-23 13:49:22  IST  )

చంద్రబాబు అధికారంలో ఉంటే కరవు వస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ...

ఆ సంస్థను వెంటనే రంగంలోకి దింపండి.. మిర్చి కొనుగోళ్లపై అంబటి సంచలన డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు(Chandrababu) అధికారంలో ఉంటే కరవు(Drought) వస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు (Former Minister Rambabu)విమర్శించారు.మిర్చి రైతుల(Chilli Farmers) సమస్యలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్(Jagan) పాలనపై గుర్తు చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. 2021లో మిర్చి రైతులకు జగన్ ప్రభుత్వం రూ.7 వేలు మద్దతు ప్రకటించిందని గుర్తు చేశారు. రైతు నష్టపోకుండా చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు. 2021లో మిర్చి రైతుల పెట్టుబడి రూ. 75 వేలు నుంచి లక్షల వరకూ ఉండేదని, ప్రస్తుతం రూ. 1.50 వేల నుంచి రూ. 2 లక్షల వరకూ ఉందని తెలిపారు. ప్రస్తుతం మిర్చి పంట చాలా చోట్ల దిగుబడి తగ్గిందని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ మిర్చి పంటకు ప్రభుత్వం ఎందుకు మద్దతు ధర ప్రకటించలేదని ప్రశ్నించారు. ఆనాడు జగన్ రైతుల పక్షాన నిలబడి, మద్దతు కల్పించే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి చాలా ఉత్పత్తులను కొనుగోలు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు విధానంలో రూ.65 వేల కోట్లు వెచ్చిచామని చెప్పారు. ఇతర పంటలకు రూ.7,800 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. ధరల స్థిరీకరణకు రూ.3 వేల కోట్లు ఇచ్చామన్నారు. జగవరి నెలలో హార్టికల్చర్ అధికారులు నివేదిక ఇస్తే చంద్రబాబు పక్కన పెట్టేశారని అంబటి ఆరోపించా.

మిర్చి ధర పడిపోయిందని, కేంద్రం కలుగజేసుకోవాలని కేంద్రాన్ని చంద్రబాబు అడగటంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. మిర్చి కొనుగోలులో కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. మిర్చి కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. మిర్చి కొనుగోలు చేసేది రాష్ట్ర సంస్థ అయిన మార్క్‌ఫెడ్ అని, కేంద్రం కాదన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా మిర్చిని కొనుగోలు చేయకుండా చంద్రబాబు మీన‌మేషాలు లెక్కపెడుతున్నారని విమర్శించారు. మిర్చి రైతులకు ఆదుకోకుండా చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి రైతులకు కూతవేటు దూరంలో ఉంటున్న చంద్రబాబు మాత్రం కనీసం ఆ వైపు కూడా చూడరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, కానీ వ్యవసాయ మంత్రి కాని మిర్చి రైతులకు పరామర్శించరని చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే అధికారులు వెళ్లి మిర్చి రైతులను పలకరించొచ్చు కదా అని అంబటి ప్రశ్నించారు.

Next Story