గుంతలో కడుతున్నారు.. 30 ఏళ్లయినా పూర్తికాదు: రాజధానిపై అంబటి సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-12 11:48:12  IST  )

ఏపీ అమరావతి రాజధానిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు..

గుంతలో కడుతున్నారు.. 30 ఏళ్లయినా పూర్తికాదు: రాజధానిపై అంబటి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(Amaravati)పై మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిని గుంతలో కడుతున్నారని, 30 ఏళ్ల పూర్తి అయినా అది పూర్తి కాదని ఆయన వ్యాఖ్యానించారు. కూటమి నేతలకు అమరావతి ఏటీఎంలా మారిందని విమర్శించారు. పొలాలు ఇచ్చిన రైతులు మాత్రం లబోదిబోమంటున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని కోసం లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారని, 500 ఎకరాల్లో సరిపోతుందని తెలిపారు. గుంటూరు- విజయవాడ మధ్య 500 ఎకరాల్లో రాజధాని నిర్మించాలని వైఎస్ జగన్ చెప్పారని తెలిపారు. కాదు కొండవీటి వాగులోనే రాజధాని కడతామంటే తమ ఇష్టమని చెప్పారు. తాము అధికారంలోకి రావడం ఖాయమని, మూడు రాజధానులపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Next Story