- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ మంత్రి అంబటికి బెయిల్ మంజూరు.. రేపు విడుదలయ్యే చాన్స్!
by Kema Shiva Kumar |
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)కు బెయిల్ లభించింది. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో ఆయనకు ఎక్సైజ్ కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌ను సైతం కొట్టివేసింది. ఈ మేరకు రూ.10 వేల రెండు పూచీకత్తులు అంబటి సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
ఇక మరోవైపు సీఎం చంద్రబాబుపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే కేసులో కూడా అంబటికి బెయిల్ లభించింది. గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ పిటిషన్‌పై వాదనలు విని, కస్టడీ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ బెయిల్ మంజూరు చేసింది. తాజాగా రెండు కేసుల్లోనే అంబటి రాంబాబుకు బెయిల్ లభించడంతో రేపు ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
Next Story






