- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు కామన్‌మెన్ కాదు.. క్యాపలిస్ట్ మెన్: మాజీ మంత్రి అమర్ నాథ్
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అమర్ నాథ్ ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోందని మాజీ మంత్రి అమర్‌నాథ్(Former Minister Amarnath) ఆరోపించారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీ(Narsipatnam Medical College)ని ఆయన సందర్శించారు. పీపీపీ(PPP) విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఖండించారు. జిల్లాల విభజన తర్వాత జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Former Chief Minister Jagan Mohan Reddy ) రాష్ట్రానికి మొత్తం 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారని గుర్తు చేశారు.
అయితే ఇప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. నర్నీపట్నం మెడికల్ కాలేజీని పూర్తి చేయడానికి చంద్రబాబుకు వచ్చిన ఇబ్బందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కామన్ మెన్ కాదని, క్యాపలిస్ట్ మెన్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అప్పుడ చేసిన 2 లక్షల కోట్లలో రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తే మెడికల్ కాలేజీలన్నీ పూర్తి అయిపోతాయని అమర్‌నాథ్ తెలిపారు.






