- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా జైల్లో ఉంచారు: మాజీ మంత్రి అమర్‌నాథ్
ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా జైలులో ఉంచారని మాజీ మంత్రి అమర్‌నాథ్ ఆరోపించారు...

దిశ, వెబ్ డెస్క్: ఏ తప్పు చేయని ఎంపీ మిథున్‌రెడ్డి(Mp Mithun Reddy)ని అక్రమంగా జైలులో ఉంచారని, లేని లిక్కర్ కేసు(Liquor Case)ను ఆయనకు ఆపాదించారని మాజీ మంత్రి అమర్‌నాథ్(Former Minister Amarnath) ఆరోపించారు. లిక్కర్ కేసులో పేర్లు చెప్పిన వారు బయట ఉన్నారని, ఏ తప్పు చేయని వ్యక్తిని లోపల ఉంచారని ఆయన విమర్శించారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని వ్యాఖ్యానించారు. జైలులో ధైర్యంగా ఉన్నాని, పార్టీ కోసం అన్ని భరిస్తానని మిథున్ రెడ్డి చెప్పారని అమర్‌నాథ్ తెలిపారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే కూటమి ప్రభుత్వం అనుసరిస్తుందని విమర్శించారు. అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన మాటలు చూశామని..చిరంజీవి ఇచ్చిన కౌంటర్ సైతం చూశామని..రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుందని, దీనికోసం మరో డైవర్షన్ అమలు చేస్తున్నారని అమర్‌నాథ్ విమర్శించారు.






