- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేర్లు మార్చితే మర్చిపోతారా: ప్రభుత్వంపై అమర్ నాథ్ మండిపాటు
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అమర్ నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు..

దిశ, వెబ్ డెస్క్: జగన్ ప్రభుత్వం(Jagan Goverment)లో 17 మెడికల్ కాలేజీలు(Medical Colleges) నిర్మించేందుకు శ్రీకారం చుట్టిందని, కానీ కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేస్తోందని మాజీ మంత్రి అమర్ నాథ్(Former Minister Amar Nath) ఆరోపించారు. పీపీపీ విధానం(PPP system)లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ఆయన మరోసారి వ్యతిరేకించారు.
విశాఖ(Visakha)లో అమర్ నాథ్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని రంగాలను ప్రైవేటు పరం చేస్తోందని వ్యా్ఖ్యానించారు. తమ హయాంలో నిర్మించిన రుషికొండపై భారీ స్థాయిలో తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. విధ్వంసకారుడంటూ జగన్‌పై బురదచల్లారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు రుషికొండ భవనాలే ఐకానిక్ భవనాలుగా మారాయని ఎద్దేవా చేశారు. అమరావతిలో నీళ్లు తోడేందుకు రూ. 450 కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు విజనరీ ఇదేనా అని ప్రశ్నించారు. సచివాలయాల పేర్లు మార్చినంత మాత్రాన వైఎస్ జగన్ చేసిన మంచి పనులు ప్రజలు మర్చిపోతారా అని నిలదీశారు. సచివాలయాల సృష్టికర్త వైఎస్ జగనేనని మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ వ్యాఖ్యానించారు.






