- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం చంద్రబాబు, లోకేశ్‌పై... ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్‌లో అవినీతి జరిగిందని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు..

దిశ, వెబ్ డెస్క్: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్(Amaravati Inner Ring Road) అలైన్మెంట్‌లో అవినీతి జరిగిందని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Former Mangalagiri MLA Allanani) ఆరోపించారు. ఈ కేసులో చంద్రబాబు(Chandrababu), నారాయణ(Narayana), నారా లోకేష్(Nara Lokesh) ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ కేసును నీరుగార్చాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఓ మిస్టేక్‌గా మార్చాలని చూస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. సీఐడీ అధికారులను బెదిరించి కేసులను కొట్టేయించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. న్యాయస్థానాల్లో అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుపై పోరాడతామని హెచ్చరించారు. ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా ఇవ్వడం లేదని, న్యాయస్థానాల నుంచే తీసుకుంటామని ఆళ్ల తెలిపారు.
చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్
కాగా సీఎం చంద్రబాబు బెయిల్ రద్దుపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ రద్దు చేయాలని రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది కోరారు. విచారణార్హతపై సీఐడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో విచారణార్హతపై వాదనలు వినిపించాలని ఇరుపక్షాలను జడ్జి ఆదేశించారు. తదుపరి విచారణ మార్చి 10కి వాయిదా వేశారు.






