- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు
మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది...

దిశ, వెబ్ డెస్క్: మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Former Mangalagiri MLA Alla Ramakrishna Reddy)కి బిగ్ రిలీఫ్ లభించింది. టీడీపీ కార్యాలయం(TDP office)పై దాడి కేసులో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. వైఎస్ జగన్(Ys Jagan) ప్రభుత్వం హయాంలో మంగళగిరి తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడిలో వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఆ సమయంలో కేసు నమోదు అయింది. అయితే ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల దూకుడు పెంచారు. అప్పటి సీసీ ఫుటేజ్ ఆధారంగా పలువురి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరికొందరిని గుర్తించే పనిలో ఉన్నారు.
అయితే ఈ కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా నిందితుడిగా ఉన్నారు. ఈ మేరకు విచారణకు హాజరుకావాలని ఆళ్లకు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. ఈ మేరకు అప్రమత్తమైన ఆళ్ల రామకృష్ణారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఆళ్ల పిటిషన్‌పై జిల్లా కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. రూ. 25 వేల పూచీకత్తుతో ఆళ్లకు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాదు రోజు విడిచి రోజు సీఐడీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.






