- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కడప మేయర్ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. మాజీ మేయర్ సురేశ్ బాబు పిటిషన్ కొట్టివేత
కడప మాజీ మేయర్ సురేశ్‌బాబుకు బిగ్ షాక్ తగిలింది...

దిశ, వెబ్ డెస్క్: కడప మాజీ మేయర్ సురేశ్‌బాబు(Kadapa Former Mayor Suresh Babu)కు బిగ్ షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు(High Court) కొట్టివేసింది. మేయర్‌గా తన పదవీకాలం ఆరు నెలలు ఉండగానే ఎన్నిక నిర్వహిస్తున్నారంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల నోటిఫికేషన్ చట్ట విరుద్ధమంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. మేయర్‌గా తనను తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టులో తాను సవాల్ చేశానని, ఆ పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే ఈసీ ఎన్నిక నోటిషికేషన్ విడుదల చేసిందని తెలిపారు. ఇలా చేయడం మున్సిపల్ చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ ఆయన కోర్టుకు వివరించారు. ఈ వ్యవహారంలో ధర్మాసనం జోస్యం చేసుకుని ఎన్నిక ప్రక్రియను నిలిపివేయాలని పిటిషన్‌లో సురేశ్ బాబు పేర్కొన్నారు.
అయితే ఇందుకు ఈసీ సైతం కౌంటర్ వాదనలు వినిపించింది. మేయర్ పదవీ కాలం ముగియకుండానే ఎన్నికల నిర్వహించకూడదనే నిబంధనలు కడప ఎన్నిక విషయంలో వర్తించదని తెలిపారు. సభ్యుడి విషయంలో మాత్రమే మున్సిపల్ చట్ట నిబంధన చెల్లుబాటు అవుతుందని ఈసీ తరపున తెలిపారు. పరోక్షంగా మేయర్ ఎన్నిక జరుగుతుందని కాబట్టే నోటిషికేషన్ విడుదల చేసినట్లు కోర్టుకు పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు కడప మాజీ మేయర్ సురేశ్ బాబు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు నుంచి కూడా క్లియరెన్స్ రావడంతో గురువారం మార్నింగ్ కడప మేయర్ ఎన్నిక జరగనుంది.






