విజయ్‌కు అవకాశం ఇవ్వండి: ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్

by Vemula.Srinu Prasad |

తమిళనాడు రాజకీయ పరిణామాలపై మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్‌‌కు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వకపోవడం, అసెంబ్లీలో విశ్వాసాన్ని నిరూపించుకునే ఛాన్స్ కల్పించకపోవడం రాజ్యాంగ విలువలకే విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు.

విజయ్‌కు అవకాశం ఇవ్వండి: ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాజకీయ(Tamil Nadu Politics) పరిణామాలపై మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు(Former IPS officer AB Venkateswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్‌(Tvk Chief Vijay)కు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వకపోవడం, అసెంబ్లీలో విశ్వాసాన్ని నిరూపించుకునే ఛాన్స్ కల్పించకపోవడం రాజ్యాంగ విలువలకే విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంటరీ సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని ఆయన విమర్శించారు. ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సిన కనీస రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాయడం సరికాదని ఏబీవీ పేర్కొన్నారు.

గవర్నర్ల వ్యవస్థపై ఫైర్

ఇదే క్రమంలో గవర్నర్ల వ్యవస్థపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఏబీ వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా మారి రాష్ట్రాల వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటున్న గవర్నర్ల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడం దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ ఉదంతం గవర్నర్ల అధికారాల పరిమితిపై మరోసారి చర్చకు దారితీస్తోందని ఏబీ వెంకటేశ్వరరావు విశ్లేషించారు.

Next Story