వైసీపీకి మరో బిగ్ షాక్.. జనసేనలో చేరడానికి సిద్ధమైన మాజీ హోంమంత్రి..!

by Gantepaka Srikanth |

గుంటూరు జిల్లాకు చెందిన మాజీ హోంమంత్రి, పత్తిపాడు మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత(Mekathoti Sucharitha) కూడా వైసీపీ(YCP)కి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

వైసీపీకి మరో బిగ్ షాక్.. జనసేనలో చేరడానికి సిద్ధమైన మాజీ హోంమంత్రి..!
X

దిశ, ప్రతినిధి గుంటూరు: గుంటూరు జిల్లాకు చెందిన మాజీ హోంమంత్రి, పత్తిపాడు మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత(Mekathoti Sucharitha) కూడా వైసీపీ(YCP)కి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆమె జనసేన(Janasena)లో చేరే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే ఆమె తన రాజకీయ భవిష్యత్తుపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం సాగుతోంది. ఆమె తన భర్త దయాసాగర్‌తో కలిసి పవన్ కల్యాణ్(Pawan Kalyan) సోదరుడు నాగబాబు(Nagababu)తో కొద్ది రోజుల క్రితం సుధీర్ఘ చర్చలు జరిపారనీ పొలిటికల్ సర్కిల్స్‌లో వినపడుతోంది.

నాగబాబు స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్నారని ఆయన రాగానే సుచరిత జనసేనలో చేరతారని ఇటు వైసీపీ, అటు జనసేన శ్రేణులు చెప్పుకొస్తున్నారు. జమిలి ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సుచరిత ముందుగానే జనసేనలో చేరాలన్న నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. నవంబర్ మొదటి వారంలో సుచరిత రాజకీయ కొత్త అడుగులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Next Story