మరో రెండు రోజుల పాటు కస్టడీకి వల్లభనేని

by Vemula.Srinu Prasad |

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి సైతం బిగ్ షాక్ తగిలింది...

మరో రెండు రోజుల పాటు కస్టడీకి వల్లభనేని
X

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Former Gannavaram MLA Vallabhaneni Vamsi)కి మరోసారి సైతం బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గన్నవరం నియోజకవర్గం(Gannavaram Constituency)లో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని ఆయనపై ఇటీవల కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులో మరింత విచారణ కోసం వల్లభేనిని కస్టడీకి ఇవ్వాలని నూజివీడు కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం పోలీసుల అభ్యర్థనకు అనుమతించింది. వల్లభనేని వంశీని రెండు రోజుల పాటు విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆయన్ను మరింత విచారించేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పలు కేసుల్లో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. ఈ తాజా కేసులోనూ ఆయనకు మరోసారి చుక్కెదురు అయింది.

Next Story