- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వల్లభనేనికి అనారోగ్యం.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనారోగ్యానికి గురయ్యారు....

దిశ, వెబ్ డెస్క్: వివిధ కేసుల్లో రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలు(Vijayawada District Jail)లో ఉన్న గన్నవరం(Gannavaram) మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) అనారోగ్యానికి గురయ్యారు. దీంతో జైలు సిబ్బంది హుటాహుటిన పోలీసుల ఆయూష్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వంశీకి చికిత్స అందిస్తున్నారు. కొంత కాలంగా ఆయన శ్వాస సంబంధింత సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం జైలుకు తరలించారు.
అయితే తనకు అనారోగ్యం కారణంగా వైద్యం చేయించుకోనేందుకు అనుమతి ఇవ్వాలని వల్లభనేని తరపున హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది. వల్లభనేని వైద్యం చేయించుకునేందుకు అనుమతి ఇచ్చింది. విజయవాడ ఆయుష్ ఆస్పత్రిలో చికిత్స అందించాలని ఆదేశించింది. తాజాగా వల్లభనేని వంశీ మరోసారి సైతం అనారోగ్యం బారిన పడటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.






