- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్ మంజూరు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్ లభించింది...

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)కి బిగ్ రిలీఫ్ లభించింది. అక్రమ మైనింగ్ కేసు(Mining Case)లో ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో గన్నవరం(Gannavaram)లో వైసీపీ(Ycp) నేతలు అక్రమంగా మైనింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వల్లభనేని వంశీ అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగాను అరెస్ట్ చేసిన రిమాండ్ కు తరలించారు. అయితే ఇదే కేసులో వంశీపైనా ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనను విచారిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఇదే కేసులో హైకోర్టును వల్లభనేని వంశీ ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయనకు రిలీఫ్ లభించినట్లైంది. కానీ మిగిలిన కేసుల్లో ఆయన రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. ఆ కేసుల్లోనూ బెయిల్ ఇవ్వాలని వంశీ అభ్యర్థిస్తున్నారు. చూడాలి మరి.






