- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. కోర్టులో లొంగిపోయిన ఇద్దరు ప్రధాన అనుచరులు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది..

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ(Former Gannavaram MLA and YSRCP leader Vallabhaneni Vamsi)కి బిగ్ షాక్ తగిలింది. ఇద్దరు ప్రధాన అనుచరులు వజ్రకుమార్, తేలప్రోలు రాముకి విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు(Vijayawada SC and ST Court) రిమాండ్ విధించింది. దీంతో వారిని జైలుకు తరలించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇద్దరిపైనా ఆరోపణలు వెల్లవెత్తాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఇద్దరూ కోర్టులో లొంగిపాయారు. విచారించిన ధర్మాసనం ఈ నెల 15 వరకు రిమాండ్ విధించింది.
కాగా జగన్ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ నాయకులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఆ సమయంలో టీడీపీ కార్యాలయంలో పని చేసిన సత్యవర్థన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశారు. అయితే కేసు నుంచి తప్పించేందుకు సత్యవర్థన్ ను కిడ్నాప్ చేశారు. తాము చెప్పినట్లు కోర్టులో వాగ్మూలం ఇవ్వాలని దాడి చేశారు. దీంతో భయపడిపోయిన సత్యవర్థన్ వైసీపీ నాయకులకు అనుకూలంగా వాగ్మూలం ఇచ్చారు.
అయితే కిడ్నాప్ వ్యవహారంపైనా కేసు నమోదు అయింది. కిడ్నాప్ నకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ప్లాన్ చేసి సత్యవర్థన్‌ను వల్లభనేని వంశీ అనుచరులు కిడ్నాప్ చేశారు. సత్యవర్థన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఆ కేసులో వల్లభనేని వంశీతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులు తాజాగా కోర్టులో లొంగిపోయారు.






