APSRTC మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నుమూత

by Jakkula.Mamatha |

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో APSRTCకి సుదీర్ఘకాలం పాటు సేవలందించిన విశ్రాంత, మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(Former Executive Director) జమ్ముల అయ్యన్న(Jammula Ayyanna)(84) కన్నుమూశారు.

APSRTC మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నుమూత
X

దిశ,వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో APSRTCకి సుదీర్ఘకాలం పాటు సేవలందించిన విశ్రాంత, మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(Former Executive Director) జమ్ముల అయ్యన్న(Jammula Ayyanna)(84) కన్నుమూశారు. ఆంధ్ర(Andhra Pradesh), రాయలసీమ(Rayalaseema), తెలంగాణ(Telangana) ప్రాంతాల్లో పనిచేసిన ఆయన తన పదవీకాలంలో నిజాయితీపరుడైన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. విజయవాడ(Vijayawada) ప్రైవేటు సిటీ బస్సు రవాణాను జాతీయీకరించడంలో అయ్యన్న కీలక భూమిక పోషించారు. ఆయన హయాంలోనే విజయవాడ బస్టాండ్(Bus Stand) రూపు దిద్దుకుంది. కడప(Kadapa)లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఏపీఎస్‌ఆర్టీసీ(APSRTC) ఇంధన సామర్థ్యం మెరుగుపరచడానికి చేసిన కృషికి గానూ అప్పటి సీఎం ఎన్టీఆర్(Sr.NTR) చేతులు మీదుగా జమ్ముల అయ్యన్న అవార్డు(Award) అందుకున్నారు.

Next Story