రాష్ట్రంలో విషాదం.. మాజీ డీజీపీ HJ దొర కన్నుమూత

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-13 10:19:03  IST  )

రాష్ట్రంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ఏపీ హెచ్‌జే దొర కన్నుమూశారు.

రాష్ట్రంలో విషాదం.. మాజీ డీజీపీ HJ దొర కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన సన్నిహితులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఉమ్మడి రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో ఈయన డీజీపీగా పనిచేశారు. గ్రేహౌండ్స్ దళాన్ని బలోపేతం చేయడంలో మరియు నక్సలిజంపై వ్యూహాత్మక పట్టు సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో సాంకేతికతను ప్రవేశపెట్టడం, కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపరచడం వంటి సంస్కరణలకు ఆయన నాంది పలికారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఐదున్నర ఏళ్లకు పైగా డీజీపీగా పనిచేసిన అరుదైన రికార్డు ఆయన సొంతం. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఈయన అత్యంత నమ్మకస్తుడైన అధికారిగా ఉండేవారు. డీజీపీగా పదవీ విరమణ చేసిన తర్వాత, ఈయన కేంద్ర నిఘా విభాగం (Central Vigilance Commission - CVC) లో విజిలెన్స్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

Next Story