- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిక్కర్ స్కాం వాళ్లే చేశారని నేను అనలేదు: మాజీ డిప్యూటీ సీఎం
లిక్కర్ స్కాం వాళ్లే చేశారని తాను అనలేదని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు..

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ స్కాం కేసు(LIquor Scam Case)లో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి(Deputy Cm Narayana Swamy)ని శుక్రవారం సిట్(SIT) అధికారులు విచారించిన విషయం తెలిసిందే. అయితే విచారణలో స్కాంకు సంబంధించి అంతా పై వాళ్లే చేశారని నారాయణ స్వామి చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఆయన తాజాగా స్పందించారు. సిట్ విచారణపై క్లారిటీ ఇచ్చారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని తెలిపారు. కానీ స్కాంలో పైవాళ్లే చేశారని తాను చెప్పలేదని తెలిపారు. అసలు లిక్కర్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనను అరెస్ట్ చేస్తారని కొందరు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇప్పటి వరకూ తాను అవినీతికి పాల్పడలేదని, నీతి నిజాయితీ బతికానని చెప్పారు. ల్యాప్ టాప్, వాట్సాప్ వాడటం కూడా తెలియదన్నారు. లిక్కర్‌ను ప్రభుత్వమే అమ్మితే అవినీతి జరిగే ఆస్కారం ఉండదన్నారు. డిప్యూటీ సీఎంగా తాను ఎక్కడా తప్పుడు సంతకాలు చేయలేదని తెలిపారు. తానేంటో సీఎం చంద్రబాబుకు కూడా తెలుసని నారాయణస్వామి వ్యాఖ్యానించారు






