శ్రీవారి దర్శనంలో AI వినియోగంపై మాజీ సీఎస్ సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

తిరుమ‌ల శ్రీవారి ద‌న్శ‌నంలో ఏఐ వినియోగంపై మాజీ సీఎస్ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆల‌యంలో గంట‌లో స్వామివారి ద‌ర్శ‌నం అనేది అసంభ‌వం అన్నారు.

శ్రీవారి దర్శనంలో AI  వినియోగంపై మాజీ సీఎస్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: తిరుమ‌ల శ్రీవారి ద‌న్శ‌నంలో ఏఐ వినియోగంపై మాజీ సీఎస్ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆల‌యంలో గంట‌లో స్వామివారి ద‌ర్శ‌నం అనేది అసంభ‌వం అన్నారు. ప్ర‌స్తుతం ఉన్న విధానాన్ని మించి ద‌ర్శ‌నంలో మార్పు చేసే అవ‌కాశం లేద‌న్నారు. ఆర్టిఫీషియ‌ల్ ఇంటిలిజెన్స్ పేరుతో టీటీడీ ధ‌నాన్ని వృథా చేయ‌డం మంచిది కాద‌న్నారు. ఇదిలా ఉంటే తిరుమ‌ల‌లో స్వామివారి ద‌ర్శ‌నానికి ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ వినియోగించాల‌ని టీటీడీ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు చైర్మ‌న్ బీఆర్ నాయుడు ఆధ్వ‌ర్యంలో బోర్డు తీర్మానం మేర‌కు ఈవో శ్వామ‌లరావు కార్యాచ‌ర‌ణ వేగ‌వంతం చేశారు. దీని కోసం ఎంట్రీ వ‌ద్ద‌, ఎక్సిట్ వ‌ద్ద కెమెరాల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. వీటి ద్వారా క్యూలైన్ లోకి అద‌నంగా వ‌చ్చి చేరుతున్న‌వారిని గుర్తిస్తారు. త‌ద్వారా భ‌క్తుల‌కు ద‌ర్శ‌న స‌మ‌యం క‌చ్చితంగా తెలుస్తుంది.

Next Story