చీమకు కూడా హాని చేయని వ్యక్తిని అరెస్ట్ చేయడం దుర్మార్గం: అంబంటి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-16 15:51:14  IST  )

కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ..

చీమకు కూడా హాని చేయని వ్యక్తిని అరెస్ట్ చేయడం దుర్మార్గం: అంబంటి
X

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ శ్రేణులను పోలీసులతో అణచలేరన్నారు. గుంటూరు జిల్లా జైలు(Guntur District Jail) నుంచి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరరావు(Journalist Kommineni Srinivasarao) విడుదల చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చీమకు కూడా హాని చేయని కొమ్మినేనిని జైలులో పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రావడం లేదని కొమ్మినేనిపై కక్ష కట్టారని ఆరోపించారు. పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో కొమ్మినేని, కృష్టంరాజుపై అమరావతి ప్రాంత ప్రజల ముసుగులో టీడీపీ గుండాలు దాడి చేసేందుకు ప్రయత్నం చేశారని మండిపడ్డారు. చీకటి పడిన తర్వాతే కొమ్మినేని విడుదల చేయాలని జైలు అధికారులు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆదేశాలు ఇచ్చారని అంబటి ఆరోపించారు.


కాగా అమరావతి మహిళలను కించపర్చిన కేసులో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం జైలు నుంచి ఆయన రిలీజ్ అయ్యారు.

Next Story