YS Jagan:అంతర్జాతీయ యోగా డే.. మాజీ సీఎం సంచలన ట్వీట్

by Jakkula.Mamatha |

అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

YS Jagan:అంతర్జాతీయ యోగా డే.. మాజీ సీఎం సంచలన ట్వీట్
X

దిశ,వెబ్‌డెస్క్: అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ‘‘ప్రశాంతతను పెంపొందించడానికి యోగా ఎంతగానో సహాయపడుతుంది. యోగా మన శరీరం, ఆత్మ రెండింటిపై పని చేస్తుంది. అలాంటి యోగాను మన జీవితంలో ఒక భాగంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. మన దైనందిన జీవితంలో ప్రతిరోజు కాసేపు యోగా చేద్దాం’’ అని మాజీ సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సూచించారు. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. కోట్లాది మంది ప్రజలు యోగా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏపీ(Andhra Pradesh)లో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా కూటమి ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించింది. ఈ తరుణంలో ఇటీవల వైఎస్ జగన్(Former CM YS Jagan) యోగాంధ్రకు ప్రజాధనం వృథా చేస్తున్నారంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ట్వీట్

Next Story