వివాదంలో ‘తండేల్’ మూవీ.. తెరపైకి మాజీ సీఎం పేరు?

by Jakkula.Mamatha |   (  Updated:2025-02-07 14:44:49  IST  )

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’ మూవీ(Tandel Movie) నేడు(ఫిబ్రవరి 7) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.

వివాదంలో ‘తండేల్’ మూవీ.. తెరపైకి మాజీ సీఎం పేరు?
X

దిశ,వెబ్‌డెస్క్: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’ మూవీ(Tandel Movie) నేడు(ఫిబ్రవరి 7) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ అన్ని చోట్ల మంచి టాక్‌తో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని సొంతం చేసుకుంది. ఇక చైతు అభిమానులు థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఇక సినిమా పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తండేల్ మూవీ పై మెకనైజ్డ్ బోట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానకి రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ మూవీని తమ మనోభావాలు దెబ్బతీసేలా తీశారని శ్రీకాకుళం మెకనైజ్డ్ బోట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానకి రామ్ మండిపడ్డారు. ‘‘ఇది అసలైన కథ కాదు. పూర్తిగా కల్పితం. 22 మందిని పాకిస్తాన్ జైలు నుంచి తీసుకొస్తే ప్రేమ కథ తీస్తారా? మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో అప్పటి సీఎం వైఎస్ జగన్(Former CM Jagan). ఆయనే రియల్ తండేల్. కానీ వాస్తవాలు లేకుండా మూవీ తీశారు’’ అని ఆయన ఫైర్ అయ్యారు.

Next Story