- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YS Jagan Mohan Reddy : ఏపీ గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్.. కారణం ఇదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ( YS Jaganmohan Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రద

- ఏపీ గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్
- ఇవాళ రాత్రే అపాయింట్మెంట్
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ( YS Jaganmohan Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ను కలిసేందుకు.. నిర్ణయం తీసుకున్నారు వైయస్ జగన్. ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారట మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. వారం రోజుల తర్వాత ఇవాళ తాడేపల్లికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి... పలుగురు వైసీపీ ( YCP) ముఖ్య నేతలతో ఇవాళ సమావేశం అయ్యారు.
అంతే కాదు ఏపీ లిక్కర్ కేసులో వరుసగా నేతలు అరెస్టు అవుతున్న నేపథ్యంలో... ఎలా ముందుకు వెళ్లాలి అనే దాని పైన కూడా... జగన్ వ్యూహాలు రచిస్తున్నారట. మిథున్ రెడ్డి అరెస్టును కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారట వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే గవర్నర్ అపాయింట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి కోరినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి ( Mithun Reddy) అరెస్టు అంశాన్ని గవర్నర్ తో చర్చించే ఛాన్స్ సమాచారం అందుతుంది. ఆ తర్వాత ఇదే అంశంపై బిజెపి నేతలతో చర్చించేందుకు ఢిల్లీకి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్తారని సమాచారం అందుతోంది.






