- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం, మనోబలం వారికి కలగాలి: మాజీ సీఎం జగన్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్‌జే దొర మృతికి మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర పోలీసు విభాగంలో విశిష్ట సేవలు అందించి హెచ్ జే దొర ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు...

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాజీ డీజీపీ హెచ్‌జే దొర(Former DGP HJ Dora) హైదరాబాద్ నిమ్స్(Hyderabad Nims)లో మృతి చెందారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు. దీంతో హెచ్‌జే దొర మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖలు సంతాపం ప్రకటించారు. మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి(Former Cm Ys Jagan Mohan Reddy) సైతం సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర పోలీసు విభాగంలో విశిష్ట సేవలు అందించి హెచ్ జే దొర ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చక్కటి కృషి చేశారని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థకు హెచ్‌జే దొర అందించిన సేవలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. హెచ్‌జే దొర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని, ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం, మనోబలం వారి కుటుంబ సభ్యులకు కలగాలని దేవుడిని జగన్ ప్రార్థించారు.






