- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందడం పై మాజీ సీఎం దిగ్భ్రాంతి
by Jakkula.Mamatha |
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా వినుకొండ మండల పరిధిలోని శివాపురం గ్రామ శివారులో ఈ రోజు(మంగళవారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శివాపురం గ్రామా శివారులో బొలెరో ట్రక్ - లారీ ఢీ కొన్న ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందారు. ఈ విషాద ఘటన పై మాజీ సీఎం, వైఎస్ జగన్ స్పందించారు.
ఈ క్రమంలో నలుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం చెందడంపై మాజీ మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులంతా ప్రకాశం జిల్లాకు చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తించారు. వారంతా మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
Next Story






