- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారికి తప్పకుండా సినిమా చూపిస్తాం.. జగన్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ(YCP) అధినేత జగన్(Jagan) మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ(YCP) అధినేత జగన్(Jagan) మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తాడేపల్లిలో పీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. తాము మళ్లీ అధికారంలోకి రాగానే డిజిటల్ లైబ్రరీ ఓపెన్ చేస్తామని ప్రకటన చేశారు. వైసీపీ నేతలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోము తీవ్ర హెచ్చరిక చేశారు. ఒక్కొక్కరిగా అందరికీ సినిమా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇలోగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని వైసీపీ శ్రేణులకు సూచించారు. గ్రామ కమిటీల నిర్మాణం సమర్థవంత చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ అంశంలో నాయకులు మరింతగా ఇన్వాల్వ్ అవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ వేధింపులపై ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. వైసీపీ కార్యకర్తలను ఎవ్వరు వేధించినా ఆధారాలతో సహా యాప్‌లో అప్‌లోడ్ చేయొచ్చు అని అన్నారు. పార్టీ డిజిటల్ లైబ్రరీలో అన్నీ సేవ్ చేస్తామని తెలిపారు. కేవలం దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి మాత్రమే సీఎం చంద్రబాబు సహా మంత్రులు సింగపూర్ పర్యటనకు వెళ్లారని జగన్ ఆరోపించారు.






