- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు బాపట్ల జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన.. కారణమిదే!
by Jakkula.Mamatha |
మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM YS Jagan) రేపు(మంగళవారం) బాపట్ల జిల్లా(Bapatla District)లో పర్యటించనున్నారు.

X
దిశ,వెబ్‌డెస్క్: మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM YS Jagan) రేపు(మంగళవారం) బాపట్ల జిల్లా(Bapatla District)లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో మేదరమెట్లలో వైసీపీ నేత(YCP Leader) వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) తల్లి పిచ్చమ్మ అంత్యక్రియల్లో ఆయన పాల్గొననున్నారు. ఆమె మృతదేహానికి నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అయితే.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం(85) పిచ్చమ్మ ఇవాళ(సోమవారం) మృతి చెందారు. పిచ్చమ్మ మృతి పై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తల్లి మరణ వార్త తెలియగానే హుటాహుటిన ఢిల్లీ(Delhi) నుంచి ఒంగోలుకు బయలుదేరారు.
Next Story






