YS Jagan:డిప్యూటీ సీఎం పవన్ పై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-05 08:15:38  IST  )

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM Jagan) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

YS Jagan:డిప్యూటీ సీఎం పవన్ పై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM Jagan) ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని, ఆయనకు వచ్చిన సీట్లకు జర్మనీలోనే ప్రతిపక్షహోదా వస్తందన్న పవన్ కామెంట్స్‌ను మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్.. ‘పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ. ఆయన జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారు’ అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. ఈ రోజు(బుధవారం) వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి (Tadepalli)లో గవర్నర్ ప్రసంగం (Governor Speech), వార్షిక బడ్జెట్‌ (Annual Budget)పై మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం విమర్శలు గుప్పించారు.

అసెంబ్లీ(Assembly)లో రెండే పక్షాలు ఉంటాయని.. ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ఎలా? అని జగన్ ప్రశ్నించారు. ఇంతమంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుందని ఎక్కడ రూలింగ్ లేదని ఆయన పేర్కొన్నారు. 175 మందిలో ఒకరికి ఇచ్చిన టైమ్ ఇస్తామంటే ఎలా? అని వైఎస్ జగన్(YS Jagan) నిలదీశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాళ్లను చరిత్రలో ఎవరినైనా చూశారా అంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర టీచర్ ఓటర్లు ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

ఢిల్లీలో బీజేపీ(BJP)కి మూడు సీట్లు ఉన్నా.. ఆప్ ప్రతిపక్ష హోదా ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ తరుణంలో వైసీపీ(YSRCP) వాళ్లకు ఏ పనులూ చేయొద్దు అన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘పథకాలు ఇవ్వడానికి, ఇవ్వక పోవడానికి ఇదేమైనా బాబు గారి సొమ్మా? ప్రజల సొమ్ముతో ప్రభుత్వం(Government) నడుస్తోంది. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని చంద్రబాబు (CM Chandrababu) ప్రమాణం చేశారు. ఇప్పుడేమో బహిరంగంగా పథకాలు ఇవ్వొద్దంటున్నారు. ఇలాంటి మనిషిని సీఎంగా కొనసాగించడం ధర్మమేనా? గవర్నర్, జడ్జిలు ఆలోచించాలి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

Next Story