ఏపీ లిక్కర్‌ స్కాం కేసుపై మాజీ సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు

by Malleboina Mahesh |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసుపై ఎట్టకేలకు మాజీ సీఎం జగన్ స్పందించారు. ఈ రోజు తాడేపల్లి‌లో.. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఏపీ లిక్కర్‌ స్కాం కేసుపై మాజీ సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసు (Liquor scam case)పై ఎట్టకేలకు మాజీ సీఎం జగన్ (Former CM Jagan) స్పందించారు. ఈ రోజు తాడేపల్లి‌లో.. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ లిక్కర్ స్కాంపై మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ రాష్ట్రంలో అయిన లిక్కర్‌ అమ్మకాలు పెరిగితే లంచాలు ఇస్తారు. కానీ వైసీపీ (ycp) ప్రభుత్వ హయాంలో లిక్కర్‌ అమ్మకాలు భారీగా తగ్గాయి. దీంతో మద్యం తయారీ సంస్థలు నష్టపోయాయి. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలతో అమ్మకాలు తగ్గి.. కంపెనీలు నష్టపోయినప్పుడు లంచాలు ఎందుకిస్తాయని ఈ సందర్భంగా జగన్ ప్రశ్నించారు.

ఎక్కడైనా మద్యం విక్రయాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే భారీగా లంచాలు ఇస్తారు. కానీ వైసీపీ ప్రభుత్వ హయాం (YSRCP government rule)లో నేరుగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపితే.. లంచాలు ఎవరి నుంచి వస్తాయో చెప్పాలని ప్రశ్నించారు. తమ హయాంలో మద్యం విక్రయాలు (Liquor sales) సజావుగా సాగాయని.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వమే ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను కట్టబెట్టి కుంభకోణాలు చేస్తుందని, రాష్ట్రంలోని ప్రతి మద్యం షాపులో పర్మిట్ రూమ్‌ల ఏర్పాటు చేశారని, పేదలకు బియ్యం డోర్ డెలివరీ ఆపి.. లిక్కర్‌ డోర్ డెలివరీ చేస్తున్నారని, రాష్రంలో MRP కన్నా ఎక్కువ రేట్లకు లిక్కర్ అమ్మకాలు చేస్తున్నారని మాజీ సీఎం జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.

Next Story