- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
AP News:నేడు బెంగళూరు నుంచి విజయవాడకు రానున్న మాజీ సీఎం జగన్..కారణం ఏంటంటే?
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చూసిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో గెలుపు పై ధీమాతో ఉన్న వైసీపీ ఊహించని విధంగా 11 స్థానాలకే పరిమితం కావడంతో పార్టీ నేతల్లో అసహనం నెలకొంది. ఇటీవల వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ బెంగళూరులో పర్యటిస్తున్నారు. అయితే బెంగళూరులో ఉన్న జగన్ నేడు (మంగళవారం) సాయంత్రం గన్నవరం చేరుకోనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో నేరుగా విజయవాడకు రానున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని నవాబుపేట గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావుపై ఇటీవల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన శ్రీనివాసరావు విజయవాడ సన్‌రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో శ్రీనివాసరావును పరామర్శించి, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు జగన్ వస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ ఆయనను పరామర్శించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం వైఎస్ జగన్ తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.