రైతులకు భారీగా నష్టం.. మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం

by Vemula.Srinu Prasad |

అకాల వర్షాలతో రైతులకు భారీగా నష్టం వాటిల్లడంతో మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు...

రైతులకు భారీగా నష్టం.. మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: రెండు రోజులుగా రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోనూ వర్షం(Rain) బీభత్సం సృష్టించింది. పంటలు, పండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారిని పరామర్శించి పరిహారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. తాడేపల్లి నుంచి జగన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు పలు కీలక సూచనలు చేశారు. అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, నష్టపోయిన రైతులను వైసీపీ నేతలు పరామర్శించాలని సూచించారు. వర్షాలపై సమాచారం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ధాన్యం సేకరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఖరీఫ్‌లో ప్రతికూల వాతావరణం, మద్దతు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అకాల వర్షాలతో మరింత నష్టపోయారని తెలిపారు. కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలవాలన్నారు. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు.

Next Story