వారం తర్వాత తాడేపల్లికి జగన్.. లిక్కర్‌ కేసుపై చర్చ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-28 10:00:33  IST  )

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వారం తర్వాత తాడేపల్లికి వెళ్లారు..

వారం తర్వాత తాడేపల్లికి జగన్.. లిక్కర్‌ కేసుపై చర్చ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో లిక్కర్ స్కామ్ కేసు(LIquor Scam Case) సంచలనంగా మారింది. ఈ కేసులో వైసీపీ నేతలు(Ycp Leaders) వరుసగా జైలుకు వెళుతున్నారు. అంతేకాదు అసలు సూత్రదారి కూడా త్వరలో జైలు(Jail)కు వెళతారని టీడీపీ(Tdp) నాయకులు ప్రచారం చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన వైసీపీ అధినేత జగన్(Ycp Chief Jagan) గుంటూరు జిల్లా తాడేపల్లికి వెళ్లారు. బెంగళూరు నుంచి వారం తర్వాత తిరిగి ఆయన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో జగన్‌ను పలువురు పార్టీ ముఖ్యనేతలు కలిశారు. సోమవారం సాయంత్రం గవర్నర్‌ను కలవాలని నిర్ణయించారు. లిక్కర్‌ కేసులో ప్రభుత్వం నెక్ట్స్‌ స్టెప్‌ ఎలా ఉండబోతుందన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అందులో భాగంగానే గవర్నర్‌ అపాయింట్‌మెంట్ జగన్‌ తీసుకున్నారు. ఈ సాయంత్రం అబ్దుల్ నజీర్‌ను కలిసి ఏపీ లిక్కర్ కేసులో తమ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఫిర్యాదు చేయనున్నారు.

Next Story