Ys Jagan: లండన్ పర్యటనకు జ‌గ‌న్.. న్యూ లుక్ అదుర్స్‌

by velandi.Saikiran |

లండన్ పర్యటనకు వెళ్లిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త లుక్ లో కనిపించారు.

Ys Jagan: లండన్ పర్యటనకు జ‌గ‌న్.. న్యూ లుక్ అదుర్స్‌
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు లండన్ పర్యటనకు బయలుదేరారు. శనివారం అర్ధరాత్రి బెంగళూరు నుంచి నేరుగా లండన్ వెళ్లారు. లండన్ లో చదువుకుంటోన్న‌ తన కుమార్తెలను కలవడానికి జగన్మోహన్ రెడ్డి దంపతులు వెళ్లినట్లు వైసీపీ నేతలు స్పష్టం చేశారు. నేటి నుంచి దాదాపు 15 రోజుల పాటు లండన్ లోనే రాజకీయాలకు దూరంగా ఉంటూ వైయస్ జగన్మోహన్ రెడ్డి రిలాక్స్ కానున్నారు. త‌న కూతుళ్ల‌తో గ‌డుప‌నున్నారు. మే 10వ తేదీన తిరిగి బెంగుళూరు చేరుకుంటారు జగన్. విదేశీ పర్యటన కోసం ఇప్పటికే సీబీఐ కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే సెక్యూరిటీ డిపాజిట్, వ్యక్తిగత ఈ-మెయిల్, ఫోన్ నెంబర్ లాంటి వివరాలను కోర్టుకు సమర్పించారు జ‌గన్.

నయా లుక్ లో వైయస్ జగన్మోహన్ రెడ్డి

లండన్ పర్యటనకు వెళ్లిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త లుక్ లో కనిపించారు. సాధారణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైట్ షర్ట్, గోధుమ రంగు ప్యాంటు మాత్రమే ధరిస్తూ కనిపిస్తారు. అయితే లండ‌న్ పర్య‌ట‌న నేప‌థ్యంలో అందుకు విభిన్నంగా జీన్స్ ప్యాంట్, బ్లూ డెనిమ్ షర్టు, షూస్ లో మెరిశారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన వైసీపీ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. మా బాస్ అచ్చం హీరోలా ఉన్నాడు అంటూ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

Next Story