వాచ్‌మెన్ల కంటే ఘోరం.. పోలీసులపై జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-10 11:36:36  IST  )

పోలీసులపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..

వాచ్‌మెన్ల కంటే ఘోరం.. పోలీసులపై జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల బట్టలూడదీస్తామని చేసిన వ్యాఖ్యలు ఇంకా మర్చిపోకముందే మరోసారి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులను వాచ్‌మెన్ల కంటే ఘోరంగా ప్రభుత్వం వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నేతల(YCP leaders)తో సమావేశమైన ఆయన సీఎం చంద్రబాబు(CM Chandrababu) విమర్శలు కురిపించారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి వర్గాన్నీ మోసం చేశారని ఆరోపించారు. రెండు బడ్జెట్‌లు పెట్టినా హామీలు అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు తిరోగమనంలోకి పోతున్నాయన్నారు. హామీల అమలు, పాలనలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌, వసతి దీవెన అందడం లేదని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతలు ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) అంటే సీఎం చంద్రబాబుకు భయమని మాజీ సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు.

Next Story