- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదాయం తగ్గడం సంపద సృష్టా..: చంద్రబాబు పాలనపై జగన్ ప్రశ్నల వర్షం
రాష్ట్ర ఆదాయం తగ్గడం సంపద సృష్టా అని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై ఆయన స్పందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని ఆరోపించారు..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ఆదాయం తగ్గడం సంపద సృష్టా అని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై ఆయన స్పందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని ఆరోపించారు. రెండేళ్లుగా అవినీతి, డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే కనిపిస్తున్నాయని విమర్శించారు. 2025-26లో జీఎస్డీపీ వృద్ధి రేటు 10.75 శాతం అని సీఎం చంద్రబాబు(Chandrababu) చెబుతున్నారని, కానీ ప్రభుత్వ ఆదాయం మాత్రం ఎందుకు 3.22కు తగ్గిందని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి చెందితే రెవెన్యూ పెరగాలి కదా అని నిలదీశారు. 2023-24లో పన్నుల ద్వారా రాష్ట్ర ఆదాయం రూ. 85 వేల 922.23 కోట్లు వచ్చిందని తెలిపారు. రెండేళ్లల్లో 8 శాతం పెరిగినా 2025-26 నాటికి రూ. లక్షా 219.69 కోట్లకు చేరాలని చెప్పారు. కానీ వాస్తవంగా వచ్చింది రూ. 86 వేల 552.68 కోట్లు మాత్రమేనని తెలిపారు. అంచనా కంటే రూ. 13 వేల 667 కోట్ల ఆదాయం తగ్గడం సంపద సృష్టా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక స్థితి ఆందోళనకరంగా ఉందని కాగ్ రిపోర్టులే చెబుతున్నాయని జగన్ పేర్కొన్నారు.






