దూకుడు పెంచిన జగన్.. 22, 23న కీలక సమావేశాలు

by Vemula.Srinu Prasad |

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో దూకుడు పెంచారు...

దూకుడు పెంచిన జగన్.. 22, 23న కీలక సమావేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) రాష్ట్ర రాజకీయాల్లో దూకుడు పెంచారు. పార్టీ బలోపేలం, ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టారు. పార్టీ ఓడిపోయి సంవత్సరం అవుతున్న నేపథ్యంలో బలోపేతంపై జగన్ దృష్టి సారించారు. ఇక నుంచి తరచూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నేతలు, కార్యకర్తలు చురుగ్గా పని చేస్తారని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు తొలుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress) నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 22, 23న వైసీపీ నేతలతో జగన్‌ సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

ఈ నెల 22న పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీతో జగన్ భేటీకానున్నారు. 23న జిల్లా అధ్యక్షులు, సోషల్‌ మీడియా ముఖ్యులతో సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌ కార్యచరణపై రెండు రోజుల పాటు చర్చించనున్నారు. పార్టీ బలోపేతం, కార్యక్రమాలపై నేతలు, కార్యకర్తల సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. పార్టీ నుంచి పలువురు వెళ్లిపోతున్న నేపథ్యంలో నేతల్లో మనోధైర్యాన్ని నింపనున్నారు. ఇప్పటి నుంచే ప్రజల్లో ఉంటే ఈసారి అధికారం ఖాయమని జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.

Next Story