- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా?: సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్
ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) విమర్శల వర్షం కురిపించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన ట్వీట్ చేశారు. అధికారంలోకి రెండేళ్లు అవుతోందని, ఉద్యోగులకు ఇచ్చిన ఐఆర్, పీఆర్సీ హామీ సంగతేంటని ప్రశ్నించారు. మొత్తం 4 డీఏలు పెండింగ్ ఉన్నాయని, దీపావళి కూడా వస్తోందని మరి ఎప్పుడు నెరవేరుస్తారని నిలదీశారు. న్యాయంగా, ధర్మంగా ఉద్యోగులకు పెరగాల్సిన జీతాలను కూడా కావాలనే ఆపుతున్నారని ఆరోపించారు. CPS/GPSల విషయంలో కల్లబొల్లి కబుర్లు చెప్పారని మండిపడ్డారు. వైసీపీ కంటే గొప్పగా చేస్తామని చెప్పి, ఇప్పుడు ఉద్యోగులకు త్రిశంకు స్వర్గంలోకి నెట్టారని విమర్శించారు. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన PRC బకాయిలు, పెండింగ్ డీఏలు, GPF, APGLI, మెడికల్ రీయింబర్స్‌మెంట్, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ లేదా ఎన్‌క్యాష్ మెంట్ లీవులు… వీటి కింద దాదాపు రూ.31వేల కోట్ల బకాయిలు పెట్టారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఉద్యోగులకు EHSకింద ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవడంతో ఆస్పత్రులన్నీ వైద్యాన్ని నిరాకరిస్తున్నాయి. పేరుకు హెల్త్ కార్డులున్నా దానివల్ల ప్రయోజనం లేకుండా పోతోంది. EHS కోసం ప్రభుత్వం తనవాటాగా ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకపోవడమే కాదు, తమ వాటాగా ఉద్యోగులు చెల్లించిన దాన్నికూడా విడుదలచేయడం లేదు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా?’’ అని జగన్ ప్రశ్నించారు.






