- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హనీమూన్ పిరియడ్ ముగిసింది.. ఇక యుద్ధమే: వైఎస్ జగన్
ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండగట్టాలని మాజీ సీఎం జగన్ అన్నారు..

దిశ, డైనమిక్ బ్యూరో: ‘మీ ఇంటికి టీడీపీ నాయకులు రాగానే నిలదీయాలి. గత ఏడాది నుంచి ఇంత బాకీ.. ఈ ఏడాది ఇంకా ఎంత రావాలి అనేది తెలియజేయాలి. ఇవి కాకుండా, చంద్రబాబు గత ఎన్నికల్లో ఏం చెప్పాడు?, పథకాల వారీగా వివరిస్తూ.. వాస్తవానికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు?..’ అని ప్రశ్నించండి అంటూ పార్టీ శ్రేణులకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సూచించారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా జగన్మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు. అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండగట్టాలన్నారు.
‘చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ..’ పేరుతో వైయస్సార్‌సీపీ ఐదు వారాల కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి క్యూఆర్ కోడ్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సం అవుతోంది. ఇంత తక్కువ వ్యవధిలో ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ స్థాయిలో గతంలో ఏనాడూ లేదన్నారు. చంద్రబాబు ఈ ఏడాది పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని ఆయన ఆరోపించారు. చంద్రబాబు పచ్చి మోసాలు ప్రజలకు వివరించడమే మన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. ‘ఏడాది గడిచింది. హానీమూన్ పీరియడ్ ముగిసింది. ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే. కాబట్టి అందరినీ కలుపుకుపోవాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇది ఎమ్మెల్యే అభ్యర్థులకు చాలా కీలకం. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. వారికి అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలపై పోరాడాలి. అప్పుడే మనం సత్తా చూపగలం...’ అని జగన్పేర్కొన్నారు






