- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయ్యా.. లోకేశ్: మీరు చేసిందేమీ లేదు: జగన్ ఫైర్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే విశాఖ స్టీల్ ప్లాంట్‌లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఉద్యోగుల తప్పిదమే లేకుండా ఈ అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. మిక్సింగ్ ప్రాబ్లంతోనే ఉక్కుద్రవం బ్లాస్ట్ అయిందన్నారు. రా మెటీరియల్ సరిగా కలపకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు..

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే విశాఖ స్టీల్ ప్లాంట్‌లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. స్టీట్ ప్లాంట్ జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఆయన పరామార్శించారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల తప్పిదమే లేకుండా ఈ అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. మిక్సింగ్ ప్రాబ్లంతోనే ఉక్కుద్రవం బ్లాస్ట్ అయిందని జగన్ పేర్కొన్నారు. రా మెటీరియల్ సరిగా కలపకపోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మానవత్వం చూపాలి గాని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పందన తీరు అమానవియంగా ఉందని మండిపడ్డారు. పరిహారం ప్రకటనలో వాళ్లకు మానవత్వం లేదన్నారు. ఇదే స్టీల్ ప్లాంట్‌లో పద్నాలుగు నెలల క్రితం జరిగిన ఘటనలో పెంటయ్య అనే కార్మికుడు చనిపోయారని, అయితే ఇప్పటి వరకూ వాళ్ల కుటుంబానికి న్యాయం జరగలేదని మండిపడ్డారు. పెంటయ్య కూతురు, కుమారులకు పరిహారం ఇస్తామని, ఇప్పటి వరకూ ఇవ్వలేదన్నారు. పెంటయ్య ఫైలు పోయిందని చెప్పారని, ఇంత దారుణంగా ప్రభుత్వం వ్యవహరించడం న్యాయమేనా అని జగన్ ప్రశ్నించారు.
మంత్రి లోకేశ్ పై ఫైర్
ఇక తాజాగా జరిగిన ఘటనలో 9 మంది మృతి చెందారని, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని జగన్ తెలిపారు. అయితే వీరికి పరిహారం ఇచ్చే విషయంలో మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యలు బాధాకరమని చెప్పారు. వాళ్లకు రావాల్సిన పరిహారాన్నే ఇస్తామన్నారు. కంపెనీ నుంచి రావాల్సిన పరిహారం మాత్రమే ఇస్తున్నారని, ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఇవ్వాలని పరిహారం విషయంలో మంత్రి లోకేశ్ మానవత్వం లేకుండా మాట్లాడారని విమర్శించారు. కోటి 72 లక్షల పరిహారంలో మంత్రి లోకేశ్ ప్రమేయం ఏమీ లేదని, కార్మికులకు రావాల్సి హక్కు అని జగన్ వ్యాఖ్యానించారు. ఏదో మంత్రి లోకేశ్ ఇస్తున్నట్లు చెప్పుకుంటున్నారని జగన్ ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం ప్రకటించిన పరిహారంలో ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం అందజేస్తామని జగన్ హామీ ఇచ్చారు.






