- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక్క రోజే గడువా..?.. కనీస సమయం ఇవ్వరా?: మాజీ సీఎం జగన్ ఫైర్
కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు....

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా ఆకుమర్రులో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన పంట నష్టంపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పంట నష్టం అంచనాలకు ఒక్క రోజు మాత్రమే గడువు ఇచ్చారని తెలిపారు. రైతులకు దరఖాస్తు చేసే సమయం సైతం ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటివరకూ పంట నష్టం అంచనా వేయలేదన్నారు. అక్టోబర్ 31కే పంట నష్టం అంచనా పూర్తి చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఆయన గుర్తు చేశారు. వైసీపీ హయాంలో రైతులందరికీ భరోసా కల్పించామన్నారు. తమ హయాంలో 16 సార్లు ప్రకృతి విపత్తులు వచ్చాయన్నారు. కూటమి ప్రభుత్వం ఈ 16 నెలల్లో ఒక్క ఇన్ పుట్ సబ్బిడీ అయినా ఇచ్చిందా అని నిలదీశారు. ధరల స్థిరీకరణ నిధితో తాము రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించామన్నారు. ప్రస్తుతం పంట నష్టంపై బీమా కూడా ఇవ్వలేదని తెలిపారు. అన్నదాత సుఖీభవ పేరుతో రూ.5వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఎరువులు సైతం బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితి ఉందని వైఎస్ జగన్ విమర్శించారు.






