- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ గవర్నర్‌ను కలిసిన మాజీ సీఎం జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి(Y.S. Jaganmohan Reddy) ఏపీ గవర్నర్ ను కలిశారు.

దిశ, వెబ్ డెస్క్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి(Y.S. Jaganmohan Reddy) ఏపీ గవర్నర్ ను కలిశారు. కొద్దిసేపటి క్రితం తన సతీమణి భారతితో కలిసి అమరావతిలోని రాజ్‌భవన్ కు చేరుకున్న జగన్.. గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్(Governor S. Abdul Nazeer) తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల అస్వస్థతకు గురైన గవర్నర్‌ను జగన్ దంపతులు పరామర్శించి, ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ముఖ్యంగా వైసీపీ నేతలపై వస్తున్న లిక్కర్ కుంభకోణం ఆరోపణలపై పలు కీలక డాక్యుమెంట్లను జగన్ గవర్నర్ కు సమర్పించారు. ఈ కేసులో ఇటీవల సిట్ అధికారులు భారతి సిమెంట్స్ లో సోదాలు జరిపిన విషయం తెలిసిందే. అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం శాంతిభద్రతలపై జగన్ గవర్నర్‌తో చర్చించారని సమాచారం.






