- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రొ. నాగేశ్వర్‌పై కేసులా?.. ప్రశ్నిస్తే అరెస్టులా?: వైఎస్ జగన్
కూటమి ప్రభుత్వం దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న గౌరవప్రదమైన వ్యక్తులపై కూడా కేసులు పెట్టించి బెదిరింపులకు దిగుతారా? అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ..

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం(Kutami Government) దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న గౌరవప్రదమైన వ్యక్తులపై కూడా కేసులు పెట్టించి బెదిరింపులకు దిగుతారా? అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy) మండిపడ్డారు. ప్రొఫెసర్ నాగేశ్వర్(Professor Nageswar)పై నమోదైన కేసులపై ఆయన స్పందించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ, నిత్యం ప్రజా గొంతుకై నిలిచే ప్రొ. నాగేశ్వర్‌పై దగ్గరుండి కేసులు పెట్టించడం దారుణం కాదా? అని ప్రశ్నించారు. ఆయన అన్ని పార్టీలమీదా విమర్శలు, అన్ని వార్తాంశాలన విశ్లేషణలు చేస్తారు కదా? అని, ఆయన నిజం మాట్లాడితే కేసులా?. ప్రశ్నిస్తే అరెస్టులా? విమర్శిస్తే వేధింపులా? అని జగన్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు జంగిల్‌రాజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ ఆయుధంగా పోలీసులు
కూటమి ప్రభుత్వం దాడులు చేసి, ప్రతిపక్షం గొంతు నొక్కి, పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఎంతకాలం పాలిస్తారని జగన్ ప్రశ్నించారు. అధికార మదంతో విర్రవీగుతున్న ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలు ఎల్లకాలం సహించరని, ప్రభుత్వ అక్రమాలు, అణచివేతలు, కక్షసాధింపులపై మా పోరాటం ఆగదని హెచ్చరించారు. ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గళం విప్పుతూ ఉంటుందని, ప్రజలకు అండగా ఉంటుందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.






