‘CM చంద్రబాబు అలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది’.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-10 14:30:36  IST  )

ఏపీ రాజకీయాల్లో అమరావతి మహిళలపై జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

‘CM చంద్రబాబు అలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది’.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ రాజకీయాల్లో అమరావతి మహిళలపై జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో నిన్న(సోమవారం) సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కొమ్మినేని అరెస్టు పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు చేయని వ్యాఖ్యలకు ఆయనను తప్పుగా ఇరికించి అరెస్టు చేయడం దారుణమన్నారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రతీకారం మాత్రమేనని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో మహిళలను అవమానించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు మహిళల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మాజీ సీఎం జగన్ విమర్శించారు. రాజకీయ అజెండాతోనే సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనిని అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. డిబేట్ నిర్వహించినందుకే ఆయనను బాధ్యుడిని చేస్తారా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం దీన్ని ఆయుధంగా మార్చుకుని ‘సాక్షి’ ఆఫీసులపై దాడులు చేయిస్తోంది మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఇవన్నీ "మహిళల గౌరవాన్ని కాపాడటం" అనే ముసుగులో జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా.. కూటమి ఏడాది పాలనలో రాష్ట్రంలో 188 అత్యాచారాలు, 15 అత్యాచార హత్యలు జరిగాయని పేర్కొన్నారు. ఇటీవలే, అనంతపురం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ గిరిజన విద్యార్థిని హత్య చేయబడి, ఆమె మృతదేహాన్ని అడవిలో పడేసి దారుణమైన దాడికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయి. ఏడుగురాళ్లపల్లి 9వ తరగతి చదువుతున్న దళిత బాలికను ఆరు నెలల పాటు సామూహిక అత్యాచారం చేశారు. ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ సీఎం జగన్ నిప్పులు చెరిగారు. వారు హామీ ఇచ్చిన భద్రత ఇదేనా? వారు కాపాడిన గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, బాలయ్య మహిళల గురించి మాట్లాడిన వీడియోలను ఆయన ట్వీట్‌ చేశారు.

Next Story